logo

మీ మనసును దానిలో పెట్టండి

తిరిగి ఇవ్వడం

Snapలో, దీర్ఘకాల ప్రభావాన్ని కలిగివుండే అవకాశాలు - పనిచేసే చోట మరియు కమ్యూనిటీలో చాలా ఉన్నాయి!
తిరిగి ఇచ్చే మా కార్యక్రమాలు ప్రధానంగా మూడు కీలకాంశాలపై దృష్టిపెడతాయి: యువతకు సాధికారత, విద్య, మరియు కళలు. మా Snap CAMP (సమాజం, కళలు, మరియు మార్గదర్శన ప్రాజెక్టులు) పై మేము ప్రతి సంవత్సరం వేలకొద్దీ గంటలు స్వఛ్ఛందంగా వెచ్చిస్తాము. కొత్తగా తల్లులైన వారి ఇళ్ళను పునరుద్ధరించడం లేదా అవసరంలో ఉన్న మహిళలకు ఉచిత కోడింగ్ తరగతులు నిర్వహించడం కావచ్చు, ఏదైనా తిరిగి ఇవ్వడంలో మేము ఎప్పుడూ ఒక నూతన మార్గాన్ని కనుగొంటుంటాము.
మా సేవాకార్యకర్తల ప్రాజెక్టులతోపాటు, Snap బృంద సభ్యులు, మా మూల స్తంభాలకు అనుగుణంగా ఉండేలా, చెల్లింపుపొందే సమయాన్ని వెచ్చిస్తూ, ప్రతినెలా ఏదైనా తమకిష్టమైన స్వఛ్ఛంద సేవను చేపట్టవచ్చు. మీకిష్టమైన విధంగా తిరిగి ఇచ్చేందుకు మేము మీకు సహాయపడదలచుకొన్నాము!

Snap కౌన్సిల్

కౌన్సిల్ అనేది ప్రజలు తమ కథలను పంచుకొనేందుకు ఒకచోటచేరి, లోతుగా విని, మరియు హృదయలోతులనుండి మాట్లాడే ఒక విధానం. బృంద సభ్యులు అంతరాయం లేకుండా మాట్లాడేందుకు అవకాశముంటుంది, దీనివల్ల అందరూ అందరినీ వినగలుగుతారు. కథలు పంచుకొనేటప్పుడు, ఇతరులు హృదయపూర్వకంగా వింటారు. ఇది ప్రజలు తమది అనే అనుభవాన్ని పొందే ఒక సమ్మిళిత పని పర్యావరణాన్ని ప్రోత్సహిస్తుంది.
మాది క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే ఒక ప్రపంచస్థాయి సంస్థ - అందువల్ల సంభాషణలో ప్రతివారు తమ స్వరాన్ని వినిపించేందుకు ఆహ్వానించడమనేది, ఒకరిని మరొకరు వినగలిగే సామర్థ్యాన్ని ప్రోత్సహించడం మాకు ముఖ్యం.

Snap బృందంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారా?