వైవిధ్యము, సమానత మరియు చేరిక
ఇతర ప్రజల దృక్పథాల నుండి మేము ప్రపంచాన్ని చూడగలిగినప్పుడు, DEI అనేది ఎంతో అవసరమనే విషయాన్ని అర్థంచేసుకొన్నాము. మేము తగిన చర్య తీసుకోవడానికి మరియు అర్థవంతమైన మార్పును సృష్టించడంలో వ్యక్తిగతంగా మరింత శ్రద్ధ తీసుకోవడానికి స్ఫూర్తి పొందాము.
Employee Resource Groups
Snapలోని ఉద్యోగుల రిసోర్స్ గ్రూప్లు (ERGs) ఒకే రకమైన గుర్తింపు కోణం (కోణాలు)ను కలిగి ఉన్న వ్యక్తుల కమ్యూనిటీను ఏర్పరుస్తాయి. ఇవి ఆ గుర్తింపును కలిగి ఉన్న బృంద సభ్యులు మరియు వారి మద్దతుదారులకు ఆసక్తికరమైన, సురక్షితమైన వేదికలను అందిస్తాయి మరియు ఒకరితో ఒకరు చెందిన సురక్షిత భావాన్ని పెంపొందిస్తాయి. ERGలు బృంద సభ్యులకు ఒకరినొకరు శక్తివంతం చేయడానికి మరియు మద్దతు ఇవ్వడానికి, సానుభూతిని ప్రోత్సహించడానికి, కమ్యూనిటీ ను జరుపుకోవడానికి మరియు వనరులను పంచుకోవడానికి అవకాశాలను అందిస్తాయి. ERGలు మన బృందాలకు కొత్త ఆలోచనలు, సృజనశీలతను తెచ్చేందుకు చాలా ముఖ్యమైనవి. ఇవి సభ్యులకు వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి, కొత్త సంబంధాలు ఏర్పరుచుకోవడానికి మరియు స్వేచ్ఛగా, నిజాయితీగా వ్యవహరించడానికి తోడ్పడతాయి.

SnapAbility
SnapAbility అనేది, ఒక వైకల్యం కలిగివున్నవారిగా గుర్తింపుపొందిన ప్రజలు మరియు వారి సంబంధీకులు, సంరక్షకులు మరియు వత్తాసు పలికేవారితోకూడిన ఒక ప్రజల కమ్యూనిటీ. మేము, మానసిక మరియు శారీరక వైకల్యాలు మరియు భిన్నంగా ఉండే శారీరక వ్యత్యాసాలపట్ల సానుభూతి, గౌరవం మరియు దయార్ద్రతను ప్రోత్సహించడంతోపాటు, మరియు మా సామర్థ్యాల ద్వారా కమ్యూనిటీలో ఒకరినొకరు శక్తివంతం చేయడాన్ని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. మా ఉత్పత్తులు జీవితంలోని అన్ని వర్గాల ప్రజలకు ఎలా అందుబాటులో ఉన్నాయో గుర్తుంచుకోవడం ద్వారా మా వినియోగదారులకు సహానుభూతిని విస్తరించాలని కూడా మేము లక్ష్యంగా పెట్టుకున్నాము.

SnapAsia
SnapAsia, ఆసియా మరియు పసిఫిక్ ద్వీప దేశాల ప్రజలు తమ అనుభవాలు, సవాళ్ళను పంచుకోవడానికి, సాంస్కృతిక అవగాహనను ప్రోత్సహించేందుకు మరియు ఆసియా సంస్కృతికి ప్రాతినిధ్యం వహించేందుకు ప్రజలందరినీ ఒక చోటికి చేరుస్తుంది. SnapAsia కమ్యూనిటీ సభ్యులకు తాము దానికి చెందినవారిమన్న ఒక సాధికార భావనను కల్పించేందుకు, వారు Snapలో వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా ముందుకు సాగడానికి ప్రేరణ మరియు మద్దతు అందించే ఉద్దేశ్యం కలిగివుంది.

SnapFamilia
SnapFamilia, హిస్పానిక్ మరియు లాటిన్x/é కమ్యూనిటీలు ఉండే భిన్నమైన వైవిధ్యతను
శక్తిమంతం చేయడం, ప్రోత్సహించడంతోపాటు దానిని వేడుక కూడా చేస్తుంది.

SnapHabibi
SnapHabibi, నైరుతి ఆసియా మరియు ఉత్తత ఆఫ్రికాల మతపరమైన లేదా రాజకీయ విశ్వాసాలతో సంబంధం లేకుండా, నైరుతి ఆసియా మరియు ఉత్తర ఆఫ్రికా యొక్క సామాజిక మరియు నైతిక సంస్కృతిని ప్రోత్సహించడానికి, వృత్తిపరమైన మరియు మేధో సంబంధ ఎదుగుదలకు మరియు నేర్చుకోవడానికి మరియు విస్తృతమైన నైరుతి ఆసియా ఇంకా ఉత్తర ఆఫ్రికా కమ్యూనిటీలకు సేవ అందించేందుకు, తద్వారా Snapchat ద్వారా, అందరినీ కలుపుకొనిపోయే మరియు శక్తిమంతం చేసే మార్గంలో మానవ వికాసాన్ని ముందుకు తీసుకొని వెళ్ళేందుకు తన సభ్యులను ఒకటిగా చేస్తుంది.

SnapNoir
SnapNoir, ప్రవాస ఆఫ్రికన్ జాతీయులు మరియు వారి సంబంధీకులను Snap వద్దకు చేర్చడంద్వారా ఒక విధమైన ఫెలోషిప్ కమ్యూనిటీని మరియు భద్రమైన ప్రదేశాన్ని ఏర్పరచేందుకు దోహదం చేస్తుంది. ఇది, Snapలోని ప్రవాస ఆఫ్రికన్ జాతికి చెందిన ప్రజలలో మరియు వారి కమ్యూనిటీలో సాంస్కృతిక అవగాహన, వైవిధ్యం, మరియు సామాజిక ప్రభావాన్ని పెంపొందించే లక్ష్యంతో పనిచేస్తుంది.

SnapParents
SnapParents అనేది, తల్లిదండ్రులు మరియు సంరక్షకులకు మద్దతు మరియు మార్గదర్శకత్వం అందించడం, పని/జీవిత సమతుల్యత మరియు స్వీయ సంరక్షణను ప్రోత్సహించడం, పనిచేస్తుండే తల్లిదండ్రులు ఎదుర్కొనే భిన్నమైన సవాళ్ళపై ప్రత్యేక దృష్టి పెడుతుంది.

SnapPride
SnapPride లింగ గుర్తింపు, లింగ వ్యక్తీకరణ, లైంగికత, మరియు లైంగిక గుర్తింపు యొక్క వైవిధ్యాన్ని వేడుకగా జరుపుకొంటోంది. ఏవిధమైన LGBTQIA2S+ అనుభవంతో నివసిస్తున్న బృంద సభ్యులకు మేము కమ్యూనిటీని కలిగివున్నాము మరియు వారి మద్దతు మిత్రులను స్వాగతిస్తున్నాము. మేము LGBTQIA2S+ గుర్తింపు, ట్రాన్స్ మరియు QBIPOC గళాలు వినిపించేలా చేయడం మరియు queer-centric కార్యక్రమాలద్వారా అవగాహన మరియు జాగృతపరచడాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఉన్నాము.

SnapShalom
SnapShalom అనేది, యూదుల వారసత్వాన్ని ఒక చోట చేరి వేడుకగా చేసుకునేందుకు మరియు Snapలోపల మరియు వెలుపల మా కమ్యూనిటీకి మద్దతివ్వడంతోపాటు, సమర్థించేందుకు Snapలో ఉన్న యూదు సభ్యులుండే ఒక బృందం.

SnapVets
SnapVets, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా మాజీ సైనికోద్యోగులు, రిజర్విస్టులు, కుటుంబ సభ్యులు మరియు పంచుకోబడిన అనుభవాలద్వారా ఒకరికొకరు మద్దతివ్వడంతోపాటు ప్రోత్సహించే వారి సంబంధీకులు, స్వఛ్ఛంద కార్యకలాపాలు, నియామక కార్యక్రమాలు, వృత్తిపరమైన అభివృద్ధి అవకాశాలు మరియు దీర్ఘకాలం ఉంచుకోవడంలో మా కమ్యూనిటీ చురుగ్గా నిమగ్నమై ఉంది. మా ERG పనిద్వారా మేము మా బలమైన సేవా విలువ మరియు Snap బృందానికి సానుకూలంగా ప్రాతినిధ్యం వహిస్తామని ఆశిస్తున్నాము.

SnapWomen
SnapWomen, Snapలో మహిళలకు మద్దతివ్వడం, శక్తిమంతంచేయడం మరియు ప్రగతి సాధించేందుకు దోహదం చేస్తుంది. అంటే, వర్క్‌షాప్‌లు, అవసరంలో ఉన్న మహిళలకు మరింత చేరువవ్వడం మరియు నేటి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అన్వేషించేందుకు Snap కమ్యూనిటీని ఒకటిగా చేయడం వంటివి ఉంటాయి.
మా భాగస్వాములు








Snap వద్ద జీవితం
Snap బృందంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారా?