ప్రతిరోజూ మీరు మీలాగా ఉండండి

వైవిధ్యము, సమానత మరియు చేకూర్పు

భిన్నమైన జీవనశైలులు కలిగివున్న లక్షలాదిమంది ప్రజలు, తమ స్నేహితులు మరియు కుటుంబంతో సమాచారం ఇచ్చిపుచ్చుకొనేందుకు ప్రతిరోజూ Snapచాట్‍ను ఉపయోగిస్తున్నారు. Snap Inc. లో అదే వైవిధ్యభరితమైన సంస్కృతులు, నేపథ్యాలు మరియు దృక్పథాలను ఒకే చోట చేర్చడమనేది మాకు ఎంతో ముఖ్యమైనది.
ఒక వైవిధ్యభరిత, సమానత్వం కలిగివుండే, సమ్మిళిత సంస్కృతి ప్రజలు తమ పనిలో ఉత్తమమైనది సాధించేందుకు, తమను ఆవిష్కరించుకొనేందుకు మరియు మా కమ్యూనిటీకి సేవలందించే సృజనాత్మక ఉత్పత్తులను తయారుచేసేందుకు దోహదం చేస్తుంది.
ఈ సంస్కృతిని మరింత బలోపేతం చేసేందుకు Snapలో మేము - ఉద్యోగి వనరుల సమూహాలు, అంతర్గత అభివృద్ధి కార్యక్రమాలు, తెలియని పక్షపాత ధోరణిపై శిక్షణ, కలసి పనిచేయడంలో శిక్షణ, భాగస్వామ్యాలు, కార్యక్రమాలు, నియామక ఉపక్రమణలు వంటివాటిద్వారా ప్రతిరోజూ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాము.
సృజనాత్మకమైన సమర్థత మరియు పరిమాణాలకు దోహదం చేస్తున్నందున DEI అనేది ప్రతి ఒక్కరి కర్తవ్యమని మేము బలంగా విశ్వసిస్తాము. జాతి, లింగం, LGBTQ+ స్థితి, వైకల్యం, వయస్సు, సామాజిక-ఆర్థిక స్థితి, తల్లిదండ్రులు మరియు రక్షణనిచ్చేవారి స్థితి, మరియు మరెన్నో ఉండే వైవిధ్యతలపట్ల మేము విస్తృతమైన ఆలోచనను కలిగివున్నాము.
ఇక్కడ మేము మా బృంద సభ్యులందరూ ఒకేచోటచేరి, వినపడేలా ఒకే గొంతుకను ధ్వనించాలని కోరుకొంటున్నాము.

ఉద్యోగుల వనరుల సమూహాలు

మా ఉద్యోగుల వనరుల సమూహాలు, Snap Inc. కుటుంబంలో రూపొందించబడి, నిర్వహించబడతాయి. అవి అందరం ఉమ్మడిగా కలిగివున్న లక్ష్యం సాధించేందుకు ఏకమయ్యేలా మాకు సాధికారత కల్పించడంతోపాటు, అప్రమత్తం చేస్తూ, దానిని బలపరచేందుకు ప్రోత్సహిస్తూ, మా నియామక ప్రక్రియను మరింతగా మెరుగుపరచేందుకు తోడ్పడతాయి.
సామాజిక కార్యక్రమాలు చేపట్టినా, అతిథి వక్తలను ఆహ్వానించినా లేదా నూతన సేవా ప్రయత్నాలు చేపట్టినా, మా ఉద్యోగుల వనరుల సమూహాలు వాస్తవికంగా ఒక వైవిధ్యభరితంగా ఉండేలా - వాస్తవ స్నేహితులుగా పనిచేస్తాయి!

SnapWomxn

SnapWomxn, Snapలోని మహిళలకు మద్దతివ్వడం, సాధికారత కల్పించడం మరియు పురోగతి సాధించేందుకు దోహదం చేస్తుంది.

SnapNoir

SnapNoir, Snapలోని ఆఫ్రికన్ సమూహానికి చెందినవారి సంస్కృతిపట్ల అవగాహన పెంపొందించేందుకు మరియు వృత్తిపరంగా అభివృద్ధి చెందేందుకు ఒక వేదికను ఏర్పరస్తుంది.

SnapPride

SnapPride మా LGBTQ+ కమ్యూనిటీకి మద్దతిస్తుంది మరియు ఆదరిస్తుంది.

SnapFamilia

SnapFamilia హిస్పానిక్ మరియు Latinx కమ్యూనిటీలన్నింటిలో విభిన్నమైన దృక్పథాలను సన్మానిస్తుంది మరియు ప్రోత్సహిస్తుంది.

స్నాప్వెట్స్

స్నాప్వెట్స్ అనేది సైనిక మాజీ ఉద్యోగులు, వారిపై ఆధారపడినవారు మరియు ఇంకా సేవనందించే వారికోసం కమ్యూనిటీని నిర్మిస్తుంది.

SnapAsia

SnapAsia, ఆసియా మరియు పసిఫిక్ ద్వీపాల బృందాలలోని సభ్యులను ఒకచోట చేరుస్తుంది.

SnapAbility

SnapAbility వైకల్యాలు మరియు మిత్రులు, సంరక్షకులు మరియు వైకల్యాలు కలిగివున్న బృంద సభ్యులకు మద్దతిస్తుంది.

SnapParents

SnapParents, Snapలోని తల్లిదండ్రులు మరియు సంరక్షకులకు మద్దతిస్తుంది.

Kaleidoscope

Kaleidoscope, సంస్థ ప్రధాన కార్యాలయం వెలుపల పనిచేసే ఉద్యోగులు కమ్యూనిటీని నిర్మించేందుకు, వైవిధ్యాన్ని ప్రోత్సహించేందుకు మరియు తమ స్థానిక కార్యాలయంలో ఒక భిన్నమైన సమ్మిళిత సంస్కృతిని నెలకొల్పేందుకు ఉద్దేశించబడినది.

మా భాగస్వాములు

Snap బృందంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారా?