మీ కెరీర్‌ను ప్రారంభించండి

అత్యుత్తమమైన వారినుండి నేర్చుకోండి

వెలుగు నిండివుండే, వైవిధ్యభరితమైన మరియు చైతన్యవంతమైన సంస్కృతి ఉండే,కొత్త ఆలోచనలకు నిరంతరం పరితపించే మా బహిరంగ కార్యాలయాలకు స్వాగతం - Snapలో మేము ప్రతిరోజూ ఆహ్లాదభరితంగా, తాజాగా విభిన్నంగా ఉండేందుకు కృషిచేస్తుంటాము.
Snap Inc. అనేది ఇంజినీర్లు, డిజైనర్లు, - మరియు ప్రపంచవ్యావ్తంగా భిన్నమైన మరియు నైపుణ్యాలతో నిండి ఉండే వైవిధ్యాలతో కూడిన బృందం. మేమంతా కలిసి, మీరు ఎదిగేందుకు ప్రోత్సహించేలా ఒక ప్రదేశాన్ని నిర్మించాము, ఇక్కడ మీరు తమ తమ రంగాలలో నిష్ణాతులైన కొంతమంది అత్యుత్తమ నిపుణులద్వారా మార్గదర్శనం పొందడంతోపాటు, ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త అంశం తెలుసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది!

Snapలో ఇంటర్న్‌షిప్‌లు

మా ఇంటర్న్‌షిప్ కార్యక్రమం విద్యార్థులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రేపు ఎదురయ్యే సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈరంగంలో నిష్ణాతులైన మేధావులతో కలిసి పనిచేసేందుకు విద్యార్థులను ఆహ్వానిస్తోంది. ఇంటర్న్‌లు Snap వద్ద నిజమైన ప్రభావాన్ని చూపించేలా ప్రోత్సహిస్తున్నాము - దానివల్ల మీరు వెంటనే ఒక అర్థవంతమైన ప్రాజెక్ట్‌లో నియమించబడతారు, ఇది మీ నైపుణ్యాన్ని విస్తరించుకోవడానికి దోహదం చేయడంతోపాటు, మీరు ప్రత్యక్షంగా పనిచేస్తున్నప్పుడు దానిఫలితాలు కూడా చూడగలుగుతారు!

Snapలో కెరీర్‌లు

మేము సృష్టించే ఉత్పత్తులనుండి, మా సంస్థ సంస్కృతి వరకు, Snap పై ప్రతి ఒక్కటీ ప్రజలు తమ భావనలను ఆవిష్కరించేందుకు దోహదం చేసేదే! భవిష్యత్తుపై అస్పష్టంగా ఉన్న పట్టభద్రులకు ఇది ఒక సరైన ప్రదేశం, ఎందుకంటే మీరు భిన్నమైన సృష్టికర్తలు మరియు సహకారమందించే ఒక వైవిధ్యభరితమైన సమూహంలో చేరుతున్నారు - మీరంతా కలిసి లక్షలకొద్దీ ప్రజలు చిరునవ్వులు చిందించేందుకు, ప్రతిరోజూ ఒకరితో మరొకరు సన్నిహితంగా ఉండేందుకు దోహదం చేసే అంశాలను తయారుచేయబోతున్నారు.

Snap బృందంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారా?